బతికి ఉండగానే తల్లిని పూడ్చేయాలనుకున్నాడు

బతికి ఉండగానే తల్లిని పూడ్చేయాలనుకున్నాడు

జగిత్యాల జిల్లా :  తల్లిని వదిలించుకోవడానికి ఓ కొడుకు దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. బతికి ఉండగానే తల్లిని స్మశానానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. వీక్లి బజార్ కు చెందిన చేట్పల్లి నర్సమ్మకు 95 ఏళ్లు. భర్త అనారోగ్యంతో 30 ఏళ్ల కిందట చనిపోయాడు.

అప్పటి నుంచి నర్సమ్మ కొడుకుతో అద్దె ఇంట్లో ఉంటోంది. అయితే కొద్ది రోజులుగా నర్సమ్మ అనారోగ్యం బాగోలేదు. దీంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటాడన్న భయంతో తల్లిని వదిలించుకోవాలనుకున్న కొడుకు.. స్మశానాకి తీసుకొచ్చాడు. బతికుండగానే తల్లిని స్మశానంలో పూడ్చేయలనుకున్నాడు. అయితే సరైన సమయంలో అక్కడికి స్థానికులు రావడంతో కొడుకు పరారీ అయ్యాడు. అనారోగ్యంతో ఉన్న నర్సమ్మను జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు స్థానికులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.