టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించినా, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా గత కొంత కాలంగా ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలు, ఆమె పోస్ట్‌లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సమంత, ప్రముఖ నిర్మాత ,దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది.
అనుమానాలను పెంచుతున్న సామ్-రాజ్ బంధం
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియకపోయినా, సమంత, రాజ్ నిడిమోరు వ్యవహార శైలి మాత్రం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గత కొన్ని నెలలుగా, సామ్ ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే ఉంటున్నారు. సినిమా ఈవెంట్లు, పబ్లిక్ పార్టీలు, లండన్ వెకేషన్లు, లేటెస్ట్‌గా వ్యాపార ప్రారంభోత్సవాలు.. ఇలా సమంత పాల్గొనే ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో రాజ్ నిడిమోరు ఆమె పక్కనే కనిపిస్తున్నారు. అంతేకాదు, వారిద్దరూ కలిసున్న ఫోటోలను స్వయంగా సమంతే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుండడం విశేషం. వీరి సన్నిహిత భంగిమలు, ఆత్మీయతతో కూడిన చూపులు ఈ బంధం కేవలం స్నేహం కంటే ఎక్కువేమోననే చర్చకు దారి తీస్తున్నాయి.
'బిగ్ హగ్'తో ఇంటర్నెట్‌ను షేక్ !
లేటెస్ట్ గా.. సమంత ప్రారంభించిన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'సీక్రెట్ అల్కమిస్ట్' (Secret Alchemist) లాంచింగ్ ఈవెంట్‌లో తీసుకున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్లతో పాటు పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ వేడుకలో టాప్‌లెస్ తరహా డిజైనర్ డ్రెస్లో సమంత అద్భుతంగా మెరిసిపోయారు. ఆమె లుక్ కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆ ఈవెంట్ అనంతరం సమంత షేర్ చేసిన ఫోటోలలో హైలైట్‌గా నిలిచింది రాజ్ నిడిమోరుతో ఉన్న పిక్చర్. ఆ ఫోటోలో, రాజ్ నిడిమోరు ఒక చేత్తో విస్కీ గ్లాస్‌ను పట్టుకుని, మరో చేత్తో సమంత నడుముపై చేయి వేసి, అత్యంత ఆత్మీయంగా బిగి కౌగిలిలో బంధించినట్లుగా కనిపించారు. ఈ ఫోటో వీరి మధ్య ఉన్న బంధానికి అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది ప్రారంభం మాత్రమే..
ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో.. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని విశ్వసించడం, ముందుకు ఎలా నడవాలో నేర్చుకోవడం లాంటివి చేశాను. అలా ఈ రోజు, నేను ఈ చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ గా మారి పోస్ట్ కు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాదు అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసేవారిని నేను కలిశాను. అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నందుకు నేను కృతజ్ఞురాలిని. చాలా నమ్మకంతో చెప్తున్నాను ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు అని పేర్కొన్నారు. సమంత పంచుకున్న ఈ ఆనందంలో రాజ్ నిడిమోరుకు ప్రత్యేక స్థానం ఉండడం, వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం పనికి సంబంధించినది మాత్రమే కాదనే సందేహాలను బలపరుస్తోంది. సమంత తన రెండవ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, ఆమె కొత్త ప్రయాణాన్ని, రాజ్ నిడిమోరు పాత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.
ప్రస్తుతం సమంత తెలుగులో 'మా ఇంటి బంగారం' మూవీలో నటిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి రాజ్ నిడిమోరు, అలాగే హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సమంత ఈ సినిమాతో పాటు, హిందీ వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. సమంత-- రాజ్ నిడిమోరు కొత్త ప్రయాణంపై అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి చివరికి వీరి ప్రయాణం పెళ్లికి దారితీస్తుందో లేదో చూడాలి.
