వెండితెరపై తన నటన, అందం, హావభావాలతో మెప్పిస్తున్న నటి అనుష్క శెట్టి. ఈ బ్యూటీ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండుగే. దక్షిణాదిలో అంతటి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వచ్చిన 'ఘాటి ' మూవీలో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పడు మలయాళం మూవీతో ప్రేక్షకులతో ముందుకు వస్తోంది అనుష్క శెట్టి..
కాలం తిరగరాసిన కథ!..
మలయాళ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటేందుకు సిద్ధమవుతున్న చిత్రం 'కథనార్'. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో జైసూర్య కథానాయకుడిగా నటిస్తుండగా, దక్షిణాది ముద్దుగమ్మ అనుష్క శెట్టి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు ( నవంబర్ 7న ) సందర్భంగా మూవీ మేకర్స్ ఆమె క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె 'నీల' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మీకు తెలిసిన కథ కాదు, కాలం తిరగరాసిన కథ! ఒక శాశ్వతమైన అందం... హ్యాపీ బర్త్‌డే, ప్రియమైన #అనుష్కశెట్టి. మా నీల రూపం..." అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది.
భారీ బడ్జెట్ తో..
'కథనార్' కేవలం బడ్జెట్ పరంగానే కాక, నిర్మాణపరంగానూ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ సినిమాను పూర్తిగా 3డీ (3D) టెక్నాలజీలో రూపొందిస్తున్నారు. 2023లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ను రోజిన్, ఆయన బృందం ఏకంగా 18 నెలల్లో 212 రోజులు షూటింగ్ జరిపి పూర్తి చేసింది. నిర్మాణ విలువలకు నిదర్శనంగా 36 ఎకరాల విస్తీర్ణంలో 45,000 చదరపు అడుగుల భారీ సెట్‌ను నిర్మించడం జరిగింది,
గ్లోబల్ రిలీజ్ ప్లాన్
ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు మలయాళి చిత్ర పరిశ్రమ ప్లాన్ చేస్తుంది. 'కథనార్' మలయాళంతో పాటు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, బెంగాలీ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్, రష్యన్, ఇండోనేషియన్, జపనీస్ సహా ఏకంగా 15 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ స్థాయిలో అంతర్జాతీయ భాషల్లో విడుదల అవుతున్న మలయాళ చిత్రం బహుశా ఇదే మొదటిది కావచ్చు. సూపర్ హిట్ మూవీ 'హోమ్' తర్వాత దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గోకులం గోపాలన్ నేతృత్వంలోని గోకులం మూవీస్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది.
దర్శకుడు రోజిన్ థామస్, జయసూర్య, అనుష్క శెట్టి వంటి స్టార్స్‌తో కలిసి ఈ 'వైల్డ్ సార్సెర్'కథను ప్రేక్షకులకు 3Dలో అందించడానికి సిద్ధమవుతున్నారు. పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం దేశీయంగానే కాక, అంతర్జాతీయంగానూ సినీ అభిమానులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం, జయసూర్య 'ఆడు 3' సినిమా పనుల్లో ఉన్నారు.ఈ సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలు మలయాళ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా ఉన్నాయి. 'కథనార్' ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Not the tale you know, but the one rewritten by time.!
— SreeGokulamMovies (@GokulamMovies) November 7, 2025
A timeless beauty..
Happy Birthday, dear #AnushkaShetty. The face of our Nila &… #Kathanar #Kathanarthewildsorcerer @GokulamMovies @GokulamGopalan #RojinThomas@Actor_Jayasurya#BaijuGopalan #VCPraveen#Krishnamoorthy pic.twitter.com/D4GKThpHXu
