దేశంలో మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. మూడు దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ.. మొదటి సెమీ హైస్పీడ్ రైలు

దేశంలో మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. మూడు దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ.. మొదటి సెమీ హైస్పీడ్ రైలు

మూడు దక్షిణాది రాష్ట్రాలను కలిపే  తొలి సెమీ హైస్పీడ్​ వందేభారత్ రైలు ను ప్రధాని మోదీ శనివారం ( నవంబర్​8) ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలను కలిపే దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటి అంతర్​ రాష్ట్ర సెమీ హైస్పీడ్​ రైలు ఇది. ఇది త్రిస్సూర్​, పాలక్కాడ్, కోయంబత్తూర్​, తిరుప్పూర్​, ఈరోడ్, సేల వంటి  ప్రధాన నగరాలను కలుపుతూ కేఎస్​ఆర్​ బెంగళూరు చేరుకుంటుంది. కేరళకు ఇది మూడో వందేభారత్​ రైలు. 

నవంబర్ 8న ప్రధాని మోదీ నాలుగు కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటితోకలిపి దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అందిస్తున్నాయి. బనారస్- ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాలలో ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. వీటితో ప్రాంతీయ కనెక్టివిటీ,మొబిలిటీని మరింత మెరుగుపడనుంది. 

ప్రయాణ సమయం ,పూర్తి షెడ్యూల్

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు ,ఎర్నాకులం మధ్య పరుగులు పెడుతుంది. సాధారణ ఇంటర్‌సిటీ రైళ్లలో 11 గంటలకు పైగా ప్రయాణ సమయాన్ని కేవలం 8 గంటల 40 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ రైలు బెంగళూరు నుంచి ఉదయం 5:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇది బుధవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఈ రాష్ట్రాలలోని కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులకు ఎటువంటి ఆటంకం లేని ప్రయాణాన్ని అందించనుంది. 

ప్రీమియం ఫీచర్లు

ప్రయాణీకుల సౌకర్యం, భద్రత కోసం రూపొందించబడిన ఈ రైలులో GPS-ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్, బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు, ఎర్గోనామిక్ సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, రీడింగ్ లైట్లు ,Wi-Fi కనెక్టివిటీ ఉన్నాయి. కేరళ గేట్‌వే అని పిలువబడే పాలక్కాడ్‌తో సహా మూడు ముఖ్యమైన దక్షిణాది రాష్ట్రాలను అధిక డిమాండ్ ఉన్న కారిడార్ ద్వారా పరుగులు పెట్టే ఈ రైలు.. వ్యాపారం, విద్య, పర్యాటకానికి వచ్చే ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేస్తుంది. సౌకర్యవంతమైన, భద్రతపరమైన సేవల ను అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్ంగా 164 కి పైగా వందేభారత్​ రైళ్లు.. వేగవంతమైన , సురక్షిత ప్రయాణాన్ని అందిస్తున్నాయి. 

మూడు దక్షిణాది రాష్ట్రాలను కలిపే తొలి సెమీ హైస్పీడ్​ వందేభారత్ రైలు ను ప్రధాని మోదీ శనివారం ( నవంబర్​8) ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలను కలిపే దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటి అంతర్​ రాష్ట్ర సెమీ హైస్పీడ్​ రైలు ఇది.