కరుడు గట్టిన ఖైదీలకు సెల్ ఫోన్లు, టీవీలు..వైరల్ అవుతన్న బెంగళూరుసెంట్రల్ జైలు వీడియోలు

కరుడు గట్టిన ఖైదీలకు  సెల్ ఫోన్లు, టీవీలు..వైరల్ అవుతన్న బెంగళూరుసెంట్రల్ జైలు వీడియోలు

పేరుకే సెంట్రల్​ జైలు.. కఠిన శిక్షలు అమలులో ఉంటాయంటారు.. కానీ అక్కడ అలాంటివేమీ కనిపించడంలేదు.. పేరుమోసిన, కరుడు గట్టిన ఖైదీలు..దర్జాగా సొంత ఇంట్లో ఉన్నట్లే గడుపుతున్నారు. వాళ్లచేతిలో ఖరీదైన సెల్ ఫోన్లు, ఎంటర్​ టైన్​ మెంట్ కోసం టీవీలు.. కూర్చునేందుకు తివాచీలు..అది ఓ జైలులా లేదు.. లగ్జరీ లైఫ్​ ఇల్లులా ఉంది. బెంగళూరు లోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీల విలాస వంతమైన జీవతాన్ని చూపిస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.. 

కర్ణాటకలోని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో లోపాలను చూపించే వీడియోలు వైరల్​ అవుతున్నాయి. సీరియల్ రేపిస్ట్ ,హంతకుడితో సహా భయంకరమైన నేరస్థులు మొబైల్ ఫోన్లను వాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తున్నారు. 

ముఖ్యంగా 1996 నుంచి 2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేసి..వారిలో 18 మందిని హత్య చేసినందుకు దోషిగా నిర్ధారించడిన ఉమేష్​ రెడ్డి జైలు లోపల రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలో దృశ్యాల్లో కనిపిస్తోంది. ఉమేష్​ రెడ్డికి అత్యాచారం, హత్యకేసులో ఉరిశిక్ష పడింది.. అయితే 2022లో అతనికి విధించిన మరణశిక్షను.. సుప్రీంకోర్టు 30 ఏళ్లజైలు శిక్షగా మార్చింది. 

మరో వీడియో రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో నిందితుడైన తరుణ్ రాజు జైలులో మొబైల్ ఫోన్ ఉపయోగించి ఆహారం వండుతుండటం కనిపించింది. కన్నడ నటి, DGP రామచంద్ర రావు సవతి కూతురు రన్యా రావుకు సంబంధించిన బంగారు స్మగ్లింగ్ కేసులో రాజు ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి.

గతేడాదది  బెంగళూరు సెంట్రల్ జైలు లోపల కన్నడ నటుడు దర్శన్ సిగరెట్ తాగుతూ, కాఫీ తాగుతున్న వీడియో వైరల్​ అయ్యాయి. దర్శన్ తన అభిమాని రేణుకస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు కేసులో జైల్లోపెట్టారు. ఈ పరిణామం రాష్ట్రంలో వివాదాన్ని రేకెత్తించింది. జైళ్ల శాఖ పనితీరుపై ,అవినీతిపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించారు. ఏడుగురు జైలు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. 

ఈఘటన తర్వాత ఏ ఖైదీకి ప్రత్యేక అధికారాలు లేదా సౌకర్యాలు కల్పించవద్దని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది కూడా. తాజాగా పరప్పన సెంట్రల్​ జైలులో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలపై వీడియోలు వైరల్​ అవడంతో మరోసారి జైళ్ల శాఖ పనితీరుపై ,అవినీతిపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.