రైల్వే మంత్రిత్వ శాఖ IRCTC వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పు చేసింది. ఏజెంట్లు/దళారులు అక్రమంగా టిక్కెట్లు బుక్ చేయకుండా ఆపడానికి అలాగే నిజమైన ప్రయాణికులకు సులభంగా టిక్కెట్లు దొరికేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త రూల్ ఏమిటంటే:
ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే IRCTC అకౌంట్ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ (ధృవీకరణ) అయి ఉండాలి. ఈ కొత్త రూల్ 28 అక్టోబర్ 2025 నుంచే అమలులోకి వచ్చిందని IRCTC తెలిపింది. సాధారణ కౌంటర్లలో (PRS కౌంటర్లు) టికెట్ బుకింగ్ సమయాలలో ఎలాంటి మార్పు లేదు.
అధీకృత టికెటింగ్ ఏజెంట్లకు (Authorized Agents) సాధారణ రిజర్వేషన్ విండో ఓపెన్ అయిన మొదటి 10 నిమిషాల వరకు పరిమితి ఉంటుంది.
తత్కాల్ బుకింగ్‌ల కోసం కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ముఖ్యంగా, తత్కాల్ ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాలలో ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేయకుండా పరిమితం చేశారు.
ఈ మార్పుకి ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు ఒకేసారి బుక్ అవ్వకుండా చూడడం అలాగే రిజర్వేషన్ విధానంలో ఎక్కువ పారదర్శకతను (Transparency) తీసుకురావడం.
