కొన్ని ఘటనలు సమాజంలో పెరుగుతున్న ధోరణులకు అద్దం పడతాయి అంటుంటారు. యవ్వనంలోకి కూడా ఎంటర్ అవ్వని.. కౌమార ప్రాయంలో ఉన్న కొందరు బాలుర ధోరణి ఎలా ఉందో ఈ ఘటన సాక్ష్యం అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం 14 ఏళ్ల బాలుడు.. 40 ఏళ్ల మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించి.. అడ్డుకుందని చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
వివారాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ హమీర్ పూర్ లో 40 ఏళ్ల మహిళను చంపేశాడు ఓ బాలుడు. సెక్సువల్ అటెంప్ట్ చేయబోయిన బాలుడిని ఆమె అడ్డుకోవడమే కాకుండా మందలించిందట. అంతే వెంటనే కొడవలి తీసుకుని నరికి పారేశాడు. చెప్పడానికి అభ్యంతరకరంగా ఉన్న ఈ ఘటన గురించి తెలసి ఉత్తర ప్రదేశ్ పోలీసులు నివ్వెరపోయారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2025 నవంబర్ 03 వ తేదీన 9వ తరగతికి (9th class) చెందిన ఒక స్టూడెంట్ దాడి చేశాడు. పంట పొలం దగ్గర ఆమె గడ్డి కోస్తుండగా అత్యాచారానికి ప్రయత్నించిన బాలుడు.. ఆమె ఆగ్రహించడంతో అక్కడున్న కొడవలి తీసుకుని నరికేశాడు.
తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న మహిళను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఛండీగఢ్ లోని పెద్ద ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నవంబర్ 5వ తేదీన న మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి కొడవలి, కర్ర, పెన్ను, స్కేల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. బాలుడిని అదుపులోకి తీసుకుని అబ్జర్వేషన్ లో ఉంచారు.
తల్లి మృతితో అనాథ అయిన దివ్యాంగుడు..
మహిళకు భర్తలేడు. 17 ఏళ్ల ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. అతడు కూడా దివ్యాంగుడు. ఆమె ఒక్కతే కష్టపడి కొడుకును చూసుకుంటూ బతుకుతోంది.
బాలుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు హమీర్పూర్ ఎస్పీ రాజేశ్ ఉపాధ్యాయ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. నిందితుడైన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
