గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్  కానిస్టేబుల్  మృతి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా జైనథ్  మండలం బెల్గాంకు చెందిన హెడ్​ కానిస్టేబుల్​ గంగన్న(58) తాంసి పోలీస్  స్టేషన్ లో డ్యూటీ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఆదిలాబాద్  పట్టణంలోని టైలర్స్  కాలనీలో నివాస ఉండే గంగన్న రోజులాగే మంగళవారం సైతం స్టేషన్​కు డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే 108కు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అదే స్టేషన్​లో రైటర్​గా పని చేస్తున్న కొడుకు చిరంజీవి కండ్ల ముందే గంగన్న ప్రాణాలు కోల్పోయాడు. స్వగ్రామం బెల్గాంలో అంత్యక్రియలు నిర్వహించారు. హెడ్​ కానిస్టేబుల్​ మృతి పట్ల పోలీస్​ ఆఫీసర్లు, పోలీసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.