పాల వ్యాన్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్కు గాయాలు

పాల వ్యాన్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్కు గాయాలు

మియాపూర్, వెలుగు: రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన కారును హెడ్​ కానిస్టేబుల్​ తొలగిస్తుండగా పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ సంఘటన మియాపూర్ మదీనాగూడ హైవేపై జీఎస్​ఎం మాల్  ఎదురుగా బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. అక్కడ ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది.

ట్రాఫిక్​ జామ్​ కావడంతో మియాపూర్​ పోలీస్​స్టేషన్​ నుంచి హెడ్​ కానిస్టేబుల్​ ఖలీముద్దీన్ తో పాటు మరో కానిస్టేబుల్​ అక్కడికి వచ్చారు. ప్రమాదానికి గురైన కారును తొలగిస్తుండగా వికారాబాద్​ నుంచి ముసాపేట్ కు వెళ్తున్న పాల వ్యాన్ వేగంగా దూసుకువచ్చి హెడ్ కానిస్టేబుల్ ఖలీముద్దీన్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కాగా దవాఖానకు తరలించారు. పాలవ్యాన్ డ్రైవర్ దేవిరెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్​ పరీక్ష నిర్వహించగా  246  పాయింట్లు వచ్చింది.