Health : పదే పదే తల నొప్పి చిరాకు తెప్పిస్తుందా.. ట్యాబ్లెట్ లేకుండా ఇంటి చిట్కాలతో ఇలా తగ్గించుకోండి..

Health : పదే పదే తల నొప్పి చిరాకు తెప్పిస్తుందా.. ట్యాబ్లెట్ లేకుండా ఇంటి చిట్కాలతో ఇలా తగ్గించుకోండి..

పూర్వకాలంలో తెల్లారు జామునే లేచి.. పనులకు పోయి.. ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు.  అయినా అలుపు సొలుపు ఉండదు.    కాని ఇప్పటి జనరేషన్​ కాస్తంత తల నొప్పికే చిరాకు పడుతున్నారు.  ఒక్క తల నొప్పే కాదు.. కడుపు నొప్పి.. ఇతరత్రా వాటితో  కొద్దిపాటి దానికే ఇబ్బందులు పడుతున్నారు.  అలాంటి నొప్పులు వచ్చినప్పుడే  ప్రతి దానికి మందులషాపునకు వెళ్లడం.. రెండు గోళీలు తెచ్చుకోవడం మింగడం అలవాటుగామారింది.  తరువాత వాటి వల్ల వచ్చే సైడ్​ ఎఫెక్ట్స్​ తో అన్నీ ఇన్నీ ఇబ్బందులు అలాకాదు.  అందుకే కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి తలనొప్పి.. ఇతర నొప్పులను ఇ ట్టే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఈ స్టోరీలో ఏ నొప్పికి ... ఎలాంటి చిట్కా ఉపయోగించాలో తెలుసుకుందాం. . . .

  • తీవ్రమైన తలనొప్పి వేధిస్తుందా.. అయితే చిటికెలో తగ్గాలంటే.. నిమ్మరసంలో అల్లం కలిపి తాగండి.     
  • పుదీన ఆకులను పేస్టులా చేసి.. సుదురు, మెడ మీద అప్లై చేస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • లవంగాల పొడిని ఒక గుడ్డలో కట్టి వాసన పీలిస్తే.. తలనొప్పి చిటికెలో మాయమవుతుంది.
  • శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారు.. కూరల్లో పచ్చిమిర్చి వాడితే... అందులోని పోషకాలు శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తాయి.
  • ఎర్ర ఉల్లిగడ్డను నలిపి పీలిస్తే... తలనొప్పి తగ్గిపోతుంది.
  • బొప్పాయి పాలను పులిపిర్లు ఉన్న చోట ప్రతిరోజూ రాస్తే.. కొన్నిరోజుల తర్వాత పులిపిర్లు రాలిపోతాయి.
  • అల్లంరసం, పసుపు పాలల్లో కలిపి తాగితే... జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది.
  • కడుపు మీద ఉండే కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే వేడి పాలను తాగాలి.