మటన్ తింటే కలిగేలాభాలు

మటన్ తింటే కలిగేలాభాలు

నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం అయితే చికెన్ ను ఇష్టపడినంతగా మటన్ ను ఇష్టపడరు అయితే ఇటీవల ఓ పరిశోధనలో మటన్ లో అనేక ఉపయోగాలున్నట్లు తేలింది. మటన్ లో అనేక  ప్రోటీన్లు ఉంటాయి.ఐరన్ ఉంటుంది,ఫ్యాట్ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది

మటన్ తినడం వల్ల ఉపయోగాలు

  • మటన్ లో  B1,B2 ,B3, B9 ,B12, విటమిన్ E,K కూడా ఉంటాయి. అంతేగాకుండా ఓమెగా 3 ఫ్యాటీసైడ్స్, ఓమేగా 6 ఫ్యాటీసైడ్స్ ఉంటాయి. ఇందులో B12 ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎక్కువగా ఉండే కొవ్వును కరిగిస్తుంది.B12 ఎర్రరక్తకణాలు ఏర్పడతాయి.
  • మటన్ తినడం వల్ల గర్భిణులు మటన్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ లాంటి సమస్యలు రావు.
  • మటన్ లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు,దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుంది.
  • బీ కాంప్లెక్స్,సెలీనియం,కొలీనియం ఉండటం వల్ల క్యాన్స్ ర్ నుంచి తప్పించుకోవచ్చు.
  • మటన్ లో పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు,గుండెపోటు, కిడ్నీ సంబంధ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.