ప్రైవేట్ ఆస్పత్రులకు హెల్త్ డైరెక్టరేట్ మార్గదర్శకాలు

V6 Velugu Posted on May 04, 2021

కరోనా సంక్షోభం మరింత విస్తృతం అవుతున్న క్రమంలో.. తెలంగాణ హెల్త్ డైరెక్టరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు లేటెస్ట్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున..కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రైవేటు ఆస్పత్రులు మోడరేట్,సివియర్ కోవిడ్ పేషంట్స్ ను మాత్రమే అడ్మిట్ చేసుకోవాలని తెలిపింది.

ప్రత్యేకంగా ఆక్సిజన్ అమర్చాల్సిన అవసరంలేని 94 శాతానికి కేసులకు హోమ్, సంస్థాగత ఐసోలేషన్ కు సిఫారసు చేయాలని సూచించింది.ముఖ్యంగా... విస్తృత, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే చేర్చుకోవాలని, కరోనా టెస్టు రిపోర్టు కోసం కోసం వారిపై ఒత్తిడి చేయరాదని ఆదేశించింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల ఎంట్రెన్స్ ల దగ్గర సాధారణ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు డిస్ ప్లే బోర్డు ద్వారా తెలియజేయాలని స్పష్టం చేసింది హెల్త్ డైరెక్టరేట్. 

Tagged private hospitals, Health Directorate, guidelines

Latest Videos

Subscribe Now

More News