హైదరాబాద్‌సిటీ,వెలుగు: రోబోటిక్ సిస్టమ్తో వైద్య రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గైనకాలజికల్ ఎండోస్కోపిస్ట్స్ -తెలంగాణ చాప్టర్, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా కేర్ హాస్పిటల్స్ సహకారంతో తాజ్ డెక్కన్‌లో ఆదివారం ‘రోబోటిక్ హారిజన్స్ ఇన్ గైనకాలజీ’ మీటింగ్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. సర్జరీల్లో కచ్చితత్వాన్ని పెంచడంలో, ఆధునిక వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయడంలో రోబోటిక్ వ్యవస్థల పాత్ర అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ మంజుల అనగని, బిజునాయర్, డాక్టర్ ఎస్.శాంతకుమారి, డాక్టర్ సుజల్ మున్షి, డాక్టర్ అతుల్ గణత్ర, డాక్టర్ కల్యాణ్ బర్మాడే పాల్గొన్నారు.
