10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనాలకు శంకుస్థాపన

10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనాలకు శంకుస్థాపన
  • డాక్టర్లు చెప్పే ప్రతి విషయాన్ని సామాన్యులు నమ్ముతారు
  • ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని సేవ చేయాలి

హైదరాబాద్: 10 రోజుల్లోనే గాంధీ, ఉస్మానియా భవనాలకు శంకుస్థాపన చేస్తామని హెల్త్​మినిస్టర్ దామోదర రాజనర్సింహ  అన్నారు. దేశంలో ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని సేవ చేయాలని డాక్టర్లకు సూచించారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. మంత్రి దామోదర డాక్టర్స్ తో కలిసి కేక్ కట్ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఐఎంఏ స్థాపనకు బీసీ రాయ్​ఆద్యుడు.  త్వరలో గాంధీ, ఉస్మానియా, కాకతీయ హాస్ట్​భవనాలకు శంకుస్థాపన చేస్తం.  రెండేండ్లలో నిర్మాణాలు పూర్తిచేస్తం. ఆస్పత్రులను 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదు. సేవలు ఎలా అందుతున్నాయన్నదే ఇంపార్టెంట్. కొత్తగా 435 డాక్టర్ పోస్టులు చేస్తం.

డాక్టర్లు చెప్పే ప్రతి విషయాన్ని సామాన్యులు నమ్ముతారు. జూడాల సమస్యలు 80 శాతం పరిష్కరించాం. నీట్‌పరీక్షను రద్దు చేయాలా, కేంద్రం నిర్వహించాలా, రాష్ట్రాలకు ఇవ్వాలా అనేదానిపై చర్చ జరగాలి. కొత్త మెడికల్ కాలేజీల కోసం అప్లై చేశాం’ అని మంత్రి తెలిపారు.