డిసెంబర్‌‌ కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలె

V6 Velugu Posted on Nov 25, 2021

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆశాలు, ఏఎన్ఎంలు , డీఎంహెచ్‌వోలతో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌‌ కల్లా కరోనా వాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచాలని అన్నారు. రాష్ట్రంలో  గర్భిణులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి హరీష్ చెప్పారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచాలని, ఎక్కువ భాగం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలన్నారు.

Tagged corona vaccination, Telangana, Harish rao, Health Minister

Latest Videos

Subscribe Now

More News