
ఆర్మూర్, వెలుగు : కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖపై ఉందని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. బుధవారం ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్లో ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డీఎంహెచ్ వో రాజశ్రీ మాట్లాడుతూ ఈ నెల 18 వరకు ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించాలని చెప్పారు. అధిక సంతానం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రమేశ్, డీఐవో డాక్టర్ అశోక్, ఎంసీహెచ్ ప్రోగ్రామ్ సూపరింటెండెంట్ సుప్రియ, వెంకటేశ్, సూపర్ వైజర్లు, డాక్టర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.