భారీ వర్షాలతో కల్లాల్లోని మిర్చిని కమ్మేసిన ఇసుక

భారీ వర్షాలతో కల్లాల్లోని మిర్చిని కమ్మేసిన ఇసుక

భద్రాద్రికొత్తగూడెం/చర్ల, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో కల్లాల్లోని మిర్చి ఇసుక మేటలో కూరుకుపోయింది. మండలంలోని కల్లెల్లి, తెగడ, గొంపల్లి, మొగల్లపల్లి, వీరాపురం, ఆర్.కొత్తగూడెం, గొమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కురిసిన భారీ వర్షాలతో కల్లాల్లోని మిర్చిని ఇసుక కమ్మేసింది. రెండు మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఇసుక మేట తొలగి మిర్చి బయటకు కనిపిస్తోంది. దాదాపు 40 ఎకరాల్లో మిర్చి దెబ్బతింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.