ఎస్సీ వర్గీకరణపై మా వాదనలు వినండి : సుప్రీంలో మాల మహానాడు పిటిషన్

ఎస్సీ వర్గీకరణపై మా వాదనలు వినండి : సుప్రీంలో మాల మహానాడు పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు :  ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కేసులో తమ వాదనలు కూడా వినాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మాల మహానాడు నేతలు తెలిపారు. శనివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఏడిఎన్ రావుతో వివిధ మాల సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో జి. చెన్నయ్య, మల్లెల వెంకట రావు, టి. పద్మారావు, బూర్గుల వెంకటేశ్వర్లు, గొపోజూ రమేష్, కె. వినయ్ కుమార్, బి. ప్రమోద్ కుమార్ లు పాల్గొన్నారు.

ఆ తర్వాత మాల మహానాడు నేత చెన్నయ్య మాట్లాడుతూ..ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో గతంలో ఐదుగురు జడ్జిల సుప్రీం కోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టివేసిందన్నారు. అయితే, ఈ కేసును రివ్యూ చేయడానికి సుప్రీంకోర్టు ఏడుగురు జడ్డిల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అందువల్ల ఆ ధర్మాసనం ముందు వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశామన్నారు.