హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బుధవారం మరోసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ సాగనుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లు.. పిటిషన్‌దారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ ను సోమవారం (సెప్టెంబర్ 29) విచారించారు.
రెండో విడతలో బుధవారం (అక్టోబర్ 01) ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని.. పిటిషన్ దారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా, కల్వకుంట్లల, చింత తరపు అడ్వకేట్లు విచారించనున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారనే దానిపై బలమైన వాదనలు వినిపించేందుకు పిటిషన్‌దారులైన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల అడ్వకేట్లు సిద్ధమవుతున్నారు. బుధవారం రోజున కూడా అసెంబ్లీలో సోమవారం నాటి ఆంక్షలే అమలు కానున్నాయి.

