మొయినాబాద్ ఫామ్ హౌస్  కేసు: నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ 7కి వాయిదా

మొయినాబాద్ ఫామ్ హౌస్  కేసు:  నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ 7కి వాయిదా

మొయినాబాద్ ఫామ్ హౌస్  కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. జైల్లో ఉన్న ముగ్గురు నిందితుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోరారు. అయితే బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నిందితుల ఆరోగ్య సమస్యలపై దాఖలు చేసిన పిటిషన్ ను  బుధవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. 

మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే రిమాండ్ ను ఆపాలని నిందితుల తరఫు న్యాయవాది రామారావు కోరారు. ఈ అభ్యర్థనను ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని తిరస్కరించారు.