హిందీ చిత్రం ‘అప్ని హద్ద్ సే లోని ‘తేరా హీ కరమ్ తేరా సహారా చాహియే’ పాట విడుదలైన నాటి నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ పాట ఆరు మిలియన్ వ్యూస్‌కి చేరువలో ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, మ్యూజిక్ యాప్స్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతూ సంగీత ప్రేమికుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో నజీర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. మంచి భావోద్వేగాలతో రూపొందించిన ఈ పాట ప్రేక్షకుల హృదయాలను తాకడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. పాటకు వస్తున్న రెస్పాన్స్ తమ టీమ్‌కు మరింత ఎనర్జీని ఇచ్చిందని అన్నాడు.
