ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల వాలీబాల్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు కొనసాగినప్పటికీ, క్వార్టర్ ఫైనల్స్ రౌండ్‌లో మాత్రం తీవ్ర నిరాశపర్చింది. గ్రూప్ దశలో అజేయంగా దూసుకెళ్లిన టీమిండియా, నాకౌట్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. జపాన్‌లోని ఒకాజాకి చువో సోగో పార్క్ జిమ్నాసియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ పోరులో భారత జట్టు గట్టి పోటీనిచ్చినప్పటికీ, ఆశించిన విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ ఓటమితో టోర్నీలో ఇండియా పతక పోరు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
గ్రూప్ దశలో అజేయ ప్రదర్శన:
ఈ టోర్నీలో భారత్ అద్భుతమైన గ్రూప్ ప్రదర్శనతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన భారత జట్టు, ముఖ్యంగా ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ అద్భుతమైన పునరాగమనం చేసి 3-2తో విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లపై విజయాలు సాధించి, పూల్-ఎ చివరి మ్యాచ్‌లో జపాన్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలై క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఆటగాళ్లు:
ఈ కీలకమైన క్వార్టర్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ జట్టు భారత్‌పై స్ట్రేట్ సెట్లలో 25-19, 25-23, 25-18 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్స్ ఆటగాళ్లు గట్టి పోటీనిచ్చినప్పటికీ, నిర్ణీత సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కానీ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు నెట్ దగ్గర పాకిస్థాన్ క్రీడాకారులతో కరచలనం చేస్తూ తమ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరుకు చక్కటి ముగింపునిచ్చింది. ఈ ఆసియా క్రీడలలో అంతకుముందు భారత్ పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ జట్లు కూడా తమ ప్రత్యర్థులతో కరచలనం చేసుకున్న ఆనవాయితీని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. ఫలితం నిరాశపరిచినప్పటికీ, ఆటగాళ్ల పరస్పర గౌరవం ఈ మ్యాచ్‌కు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
PAKISTAN WIN 3–0 & ADVANCE TO THE SEMIFINAL!
— Pakistan Olympic Association (@NOCPakistan) October 1, 2026
Team Pakistan delivered a commanding performance, defeating India 3–0 in the Men’s Quarterfinal of Volleyball at the 20th Asian Games, Aichi-Nagoya 2026.
With this dominant victory, Pakistan have secured their place in the semifinal. pic.twitter.com/YPeNgeood7
