నెటిజన్ల మదిని దోచుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్.. ఆకాశంలో చిన్నారికి సర్ ప్రైజ్

నెటిజన్ల మదిని దోచుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్.. ఆకాశంలో చిన్నారికి సర్ ప్రైజ్

పుట్టినరోజంటే ఎవరికి మాత్రం ప్రత్యేకంగా చేసుకోవాలని ఉండదు. ఈ ప్రత్యేకమైన రోజును కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. చాలా మంది తమ పుట్టిన రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటారు. ఆ ఆనందాన్ని, జ్ఞాపకాలను ఓ పాపకు ఎప్పటికీ గుర్తుండేలా చేయాలనుకుంది ఇండిగో ఎయిర్ లైన్స్. విమానం గాల్లో ఉండగానే ఆ చిన్నారి ఫస్ట్ ఇయర్ బర్త్ డేను సెలబ్రేట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది.

దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆ పాప తండ్రి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన కూతురు బ్యూలా లాల్ బర్త్ డేను ఇంత స్పెషల్ డేగా చేసినందుకు ఆయన ఇన్ స్టాగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజశారు. ఇక అతను షేర్ చేసిన వీడియోను గమనిస్తే.. అందులో కెప్టెన్.. ఆ పాపను ఎత్తుకుని విమానంలోకి రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత "లేడీస్ అండ్ జెంటిల్‌మాన్. దయచేసి ఒకసారి ఇటు చూడండి. నేను మీ కెప్టెన్. నా పేరు అగస్టిన్. అది ముఖ్యం కాదు. దాని కంటే మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రోజు ఈ చిన్నారి మొదటి పుట్టినరోజు" అని అతను చెప్పడం వినవచ్చు. ఆ తర్వాత "బ్యూలా లాల్ ఈ రోజుతో తన జీవితంలో మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. కాబట్టి కేక్ కట్ చేసి ఇప్పుడు అందరికీ పంచిపెడుతుంది. మీరంతా ఈ పాపను ఆశీర్వదించండి" అని కెప్టెన్ చెప్పడం చూడవచ్చు.

ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 10లక్షల వ్యూస్ రాగా.. చాలా మంది ఇండిగో ఎయిర్ లైన్స్ ను ప్రశంసిస్తున్నారు. అంతే కాకుండా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో కేక్ కటింగ్ వేడుకకు సంబంధించిన వీడియోను కూడా చిన్నారి తండ్రి షేర్ చేశాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది సమక్షంలో చిన్నారి చాక్లెట్ కేక్ కట్ చేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.