నీటిలో మునిగిన రెండు ఫ్లోర్లు.. శ్రీశైలం పవర్ ప్లాంట్లోఇంకా పొగలు,వేడి

నీటిలో మునిగిన  రెండు ఫ్లోర్లు.. శ్రీశైలం పవర్ ప్లాంట్లోఇంకా పొగలు,వేడి

శ్రీశైలం పవర్ ప్లాంట్లో కింది రెండు ఫ్లోర్లు ఇంకా నీళ్లలోనే మునిగి ఉన్నాయి. పై ఫ్లోర్లనుంచి ఇంకా పొగలు, వేడి వెలువడుతున్నాయి. దీంతో ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన టీమ్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. శని, ఆదివారాల్లో ప్లాంట్ పై రిశీలనకు వచ్చిన సీఐడీ టీమ్లు.. ప్లాంటు ఎంప్లాయిస్, జెన్కో ఆఫీసర్ల ప్రశ్నించి హైదరాబాద్  వెళ్లిపోయాయి. జెన్కో నియమించిన ఇంటర్నల్ ఎక్స్పర్స్ కమిటీ  సోమవారం విచారణలో భాగంగా బేస్ లెవల్లో ఉన్న రెండో ఫ్లోర్ దగ్గరికి మాత్రమే వెళ్లగలిగింది. పై ఫ్లోర్ల నుంచి ఇంకా పొగలు, వేడి వస్తుండగా.. మొదటి ఫ్లోర్ మొత్తం సీపేజీ వాటర్, మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు చల్లిన నీటితో నిండిపోయిందని, రెండో ఫ్లోర్లోనూ ఏడు అడుగుల మేర నీళ్లు ఉన్నాయని టీమ్ గుర్తించింది. అధికారులు నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు చేపట్టారు. నీళన్నీ  ఎత్తిపోస్తే తప్ప  టర్బైడ్ల పరిస్థి తి ఏమిటనేది తెలియదు.

ఆరో యూనిట్కు భారీ నష్టం!

ఎస్పీడీసీఎల్సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్రావు, ట్రాన్స్కో డైరెక్టర్లు సచ్చిదానందం, జగత్ రెడ్డి, సీఈ సురేశ్తో కూడిన జెన్కో టీమ్ సోమవారం ప్లాంట్లోని సెకండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ తర్వాతి పరిస్థితులను పరిశీలించింది. ఆరో యూనిట్లో భారీగా నష్టం జరిగినట్లు గుర్తించింది. అందులో 10 బ్లాక్స్ఉండగా మూడు పూర్తిగా దహన మయ్యాయని ఆఫీసర్లు అంటున్నారు. మూడో యూని ట్లోనూ జనరేటర్, ప్యానెల్స్, డోర్స్ దెబ్బతిన్నాయని గుర్తించినట్టుచెప్తున్నారు. నష్టం అంచనా విషయంలో సీఐడీకి చెందిన ఎలక్ట్రికక్ట్రిల్ ఎక్స్పర్ట్స్, జెన్కో టీం దాదాపు ఒకే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జెన్కో టీమ్ కూడా సర్వీస్ మీద ఉన్న రెండో ఫ్లోర్ వరకే వెళ్లగలిగింది. మొదటి ఫ్లోర్ పూర్తిగా, రెండో ఫ్లోర్లో 7 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచి ఉన్నట్టు గుర్తించింది. ఈ నీళన్నీ తోడేశాక సర్వీస్  కింద 125 మీటర లోతు లోపల పరిస్థితి ఏమిటనే దానిపై స్పష్టత వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. మరోవైపు పవర్ ప్లాంట్లో కరెంట్ సరఫరా పునరుద్ధరించేందుకు జెన్కో ఇంజనీర్లు చర్యలు చేపట్టారు. ఉద్యోగ సంఘాల క్యాండిల్ ర్యాలీ పవర్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపంగా జెన్కో సంఘాల ఆధ్వర్యంలో రోజూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం పవర్ హౌస్ జెన్ కో కాలనీ నుంచి అడ్మిన్ భవనం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, మృతులకు నివాళి అర్పించారు. మంగళవారం మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉద్యో గుల ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రాణాలకు తెగిస్తే .. ఫలితం ఇదేనా?

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీశైలం పవర్ ప్లాంటు ప్రమాదం ఘటనలో సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడితే ఫలితం ఇదేనా? అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియానుపెంచాలని ఉద్యోగుల్లో డిమాండ్‌ ‌‌‌‌‌‌‌వ్యక్తమవుతోంది. వేల కోట్ల ప్రాజెక్టు యూనిట్లను సురక్షితంగా మూసి వేయడానికి, మెషీన్లకు నష్టాన్ని తగించడానికి సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయలేదని, వారు యుద్దంలో సైనికుల్లా పోరాడి వేల కోట్ల జెన్‌‌‌‌‌‌‌‌కో ఆస్తులు కాపాడారని ఉద్యోగులు అంటున్నారు. ఎక్స్ గ్రేషియాను రూ.2 కోట్లకు పెంచాలని కోరుతున్నారు. ఏఈలు చిన్న వయసులోనే చనిపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు తీవ్ర షాక్ లో ఉన్నారు. వారి పిల్లల భవిష్యత్తు గురించి సర్కారు ఆలోచించాలని ఉద్యోగ సంఘాలు, జేఏసీలు డిమాండ్ చేస్తున్నాయి.

సీఎండీని కలిసిన జేఏసీ..

తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు జెన్‌‌‌‌‌‌‌‌కో సీఎండీ ప్రభాకర్ రావుని కలిసి వినతిప త్రం అందించారు. సీఎండీని కలిసినవారిలో జేఏసీ ప్రతినిధులు రత్నాకర్ రావు, పద్మారెడ్డి, వజీర్, సదానందం, మేడి రమేష్, రమేష్ 327, వంశీ, నెహ్రు, భానుప్రకాశ్ తదితరులు ఉన్నారు.