కిటకిటలాడుతున్న స్టేషనరీ షాపులు

కిటకిటలాడుతున్న స్టేషనరీ షాపులు
  • మునుపటి గిరాకీలు చూస్తున్నామంటున్న వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు: కొత్త అకడమిక్  ఇయర్ స్టార్ట్ ​కావడంతో సిటీలోని స్టేషనరీలు, బ్యాగ్​లు, బుక్​షాపుల్లో రద్దీ నెలకొంది. పిల్లలు, తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. కరోనాతో రెండేళ్లుగా బిజినెస్ జరగలేదని, ఈసారి రేట్లు పెరగడంతోపాటు సేల్స్​ కూడా పెరిగాయని కోఠి, బేగం బజార్, ఉస్మాన్ గంజ్ ప్రాంతాల్లోని వ్యాపారులు చెబుతున్నారు. అన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నట్లే స్టేషనరీ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. హోల్ సేల్ వ్యాపారులు అకడమిక్ ఇయర్‌‌‌‌ని దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టుకున్నప్పటికీ, డిస్ట్రిబ్యూటర్ల నుంచి స్టాక్ షార్టేజ్​ఉందని వ్యాపారులు అంటున్నారు.

నోట్ బుక్స్, స్టేషనరీ వస్తువుల రేట్లు 15 నుంచి 20 శాతం పెరిగాయి. గతంలో రూ.300 ఉండే బ్యాగ్​ను ప్రస్తుతంరూ.500కు అమ్ముతున్నారని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, బ్యాగుల స్కూళ్లకు పంపేందుకు కావాల్సిన ప్రతీది పిల్లలతో పాటు వెళ్లి కొంటున్నారు. అబిడ్స్​లోని గల్లీల్లో సెపరేట్‌‌గా స్కూల్, కాలేజీ బ్యాగ్​లు అమ్ముతున్నారు. వివిధ రకాల బ్రాండ్‌‌ల బ్యాగులు అందుబాటులో ఉంచారు. ట్రాన్స్‌‌పోర్టు ఛార్జీలు పెరగడంతో బ్యాగుల ధరలు 30 శాతం అధికమయ్యాయని వ్యాపారులు అంటున్నారు. లంచ్ బాక్సులు మోడల్​ను బట్టి రూ.150 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. ఉస్మాన్​గంజ్‌‌లో 150 నుంచి 200కు పైగా బుక్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే కోఠి, బేగంబజార్​లో అధిక సంఖ్యలో బుక్ స్టోర్స్, స్టేషనరీ షాప్స్ ఉన్నాయి.