జంట జలాశయాలకు భారీగా వరద..

జంట జలాశయాలకు భారీగా వరద..
  • ఉస్మాన్​ సాగర్​ 10 గేట్లు 6 అడుగుల వరకు ఓపెన్​
  • హిమాయత్​ సాగర్​ 4 గేట్లు 3 అడుగుల వరకు ఎత్తిన అధికారులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: వర్షాలతో ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​లకు భారీగా వరద నీరు చేరుతోంది. రెండింటి నుంచి మూసీలోకి 35 వేల క్యూసెక్కుల వరద  కొనసాగుతోంది. ఉస్మాన్​ సాగర్​ 13 గేట్లను 9 అడుగుల మేరకు ఎత్తి మూసీలోకి 13500 క్యూసెక్కులను వదులుతున్నారు. 

దీని ఎఫ్​టీఎల్​ 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.15 అడుగుల నీరు ఉంది. హిమాయత్​ సాగర్​ గేట్లు 17 ఉండగా శుక్రవారం 9 గేట్లను 5 అడుగుల వరకు ఎత్తారు. ఎఫ్టీఎల్​ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.95 అడుగులకు నీరు చేరింది. దీని  ఔట్​ఫ్లో 21500 క్యూసెక్కులు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వాటర్​ బోర్డు సిబ్బందికి రెండు రోజులు సెలవులు రద్దు చేశారు.