భారీగా గంజాయి స్వాధీనం

V6 Velugu Posted on Jan 26, 2022

సంగారెడ్డి జిల్లా - గుండా తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. కోహీర్ మండలంలోని పీచేర్యాగడిలో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి ముంబయికి బొలెరో వాహనంలో అక్రమ రవాణా చేస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పీచేర్యాగడి శివారులో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనం అడుగు భాగంలో అదనపు ఒరలు అమర్చి తరలిస్తున్నారు. 150 కిలోల  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 21 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.  

Tagged POLICE, seizure, , Heavy marijuana

Latest Videos

Subscribe Now

More News