న్యూయార్క్ నగరాన్ని పొగ కమ్మేసింది..

న్యూయార్క్ నగరాన్ని పొగ కమ్మేసింది..

అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని పొగ కమ్మేసింది. . కెనడాలోని కార్చిచ్చు వల్ల న్యూయార్క్ సిటీలో ఆకాశం అంతా పొగతో నిండి పోయింది. గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడి పోయింది. దీంతో ఈ పొల్యుషన్ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రజలు ఔట్ డోర్ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచనలు చేసింది.

కాలుష్యం డేంజర్ బెల్స్

న్యూయార్క్ లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఢిల్లీ, బాగ్దాద్ నగరాల కన్నా న్యూయార్క్ నగరంలో అత్యధిక కాలుష్యం వున్నట్టు చెప్పారు.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 226 గా వున్నట్టు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218 వరకు పడిపోయే ప్రమాదం వుందని న్యూయార్క్ మేయర్ ఓ ప్రకటనలో తెలిపారు.అమెరికా అంతటా ఆకాశం ఆరెంజ్ రంగులోకి మారింది. కార్చిచ్చు కారణంగా సాధారణం కంటే 2 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది.

 18 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

 కెనడాలో రగిలిన కార్చిచ్చు వల్ల అమెరికాలోని 18 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కార్చిచ్చు వల్ల వెలువడుతున్న పొగ.. వాతావరణం కాలుష్యానికి కారణమైంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందక్కడ. పొగ గాఢత తక్కువ పరిణామంలో ఉన్నప్పటికీ ఆ గాలిని పీల్చితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఊపిరి తిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. వృద్దులు, పిల్లలు, మహిళలు, గర్బిణులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాలుష్యం నేపథ్యంలో నగర వాసులు ఔట్‌డోర్ కార్యక్రమాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని సూచించారు.

మంగ‌ళ‌వారం ( జూన్ 6)  రాత్రి 1.05 నిమిషాల స‌మ‌యంలో న్యూయార్క్‌లో కాలుష్య ఇండెక్స్ 0-500 మ‌ధ్య ఉన్నట్లు తేల్చారు. ఇక కెన‌డాలో కార్చిచ్చు అంటుకుంది. అత్యంత వేగంగా అడవులను కార్చిచ్చు దహిస్తోంది. 415 ప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 3.3 మిలియ‌న్ల హెక్టార్లలో అడ‌వి కాలిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు.. 43 ఏళ్లలో కాలుష్యం ఇంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.

ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటి

1960 తరువాత ఈ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడం ఇదే మొదటిసారి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పుల కారణంగా పలు విమానాలను కూడా దారి మళ్లించినట్లు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. లో- విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడినట్లు వివరించారు. రైళ్ల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.