
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడ్ పల్లి, సీతాపల్ మండి, రాణిగంజ్, ప్యారాడేజ్, బేగంపేట, రాంగోపాల్ కంటోన్మెంట్, బోయిన్ పల్లి, కార్ఖాన, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ లో తెల్లవారుజామున గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. దాదాపు అరగంటపాటు భారీ వర్షం కురింసింది. కొద్దిసేపు కురిసిన వర్షానికే రోడ్లపై నీళ్లు నిలబడ్డాయి.