హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. 4గంటల వరకు ఎండ ఉంటే,… ఒక్కసారిగా ఈదురు గాలులు మొదలయ్యాయి. దీంతో 5గంటలకే సిటీలో చీకటి పడింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

మల్కాజ్ గిరి, నేరెడ్ మెట్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, సైనిక్ పురి, దమ్మాయిగూడ, జవహర్ నగర్, మేడ్చల్, కీసర, అల్వాల్, ఈసీఐఎల్, తిరుమలగిరి, యాప్రాల్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అయింది.