హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఈ రూట్లలో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఈ రూట్లలో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, అశోక్ నగర్, మియాపూర్, ఖైరతాబాద్, బంజారహిల్స్, లక్డికాపూల్, దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, కోఠి, బషీర్ నగర్, సుల్తానా బజార్, బేగంబజార్, అఫ్జల్ గంజ్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో మేఘాలు నల్లగా మారి కుండపోత వాన కురుస్తోంది. 

సాయంత్రం వేళ కావడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ క్రమంలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.