హైదరాబాద్లో జోరువాన..కాలనీలు, రోడ్లు జలమయం

హైదరాబాద్లో జోరువాన..కాలనీలు, రోడ్లు జలమయం

హైదరాబాద్ లో జోరువాన..సిటీలోని చాలాప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడింది. భారీవర్షాలు కురుస్తుండటంలోGHMC మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, DRF బృందాలను అప్రమత్తం చేశారు అధికారు. రానున్న రెండు గంట్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం ఉందని హెచ్చరికలు జారీ  చేసింది వాతావరణ శాఖ. 

హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన.. pic.twitter.com/iqmEWxNhKE

— దివిటి ఛానల్ (@risingsun143) June 12, 2025

హైదరాబాద్ సిటీ పరిధిలోని ముషీరాబాద్ , చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. రామంతపూర్, అంబర్ పేట్ లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లోకూడా  భారీగా వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్, ఘట్ కేసర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీగా వర్షం కురిసింది. 

మరోవైపు మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది.  నాగారం,దమ్మాయిగూడ,ఘాట్ కేసర్,పోచారం మున్సిపాలిటీలో వాన పడింది. కుషాయిగూడ, కాప్రా, ఈసిఐఎల్, మౌలాలి, మల్కాజిగిరి, నేరేడ్ మెంట్, ఆనంద్ బాగ్, చర్లపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. 

మరోవైపు సిటీ నడిబొడ్డున కూడా వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్లపైకి వరదనీరు వచ్చి చేరింది.  సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు.. మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. 

మోండా మార్కెట్, రేజిమెంటల్ బాజార్, మారేడు పల్లి, అడ్డగుట్ట, తుకారామ్ గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, ప్యారడైజ్,  బేగంపేట్, రసూల్ పుర, బోయిన్ పల్లి, కార్ఖనా తోపాటు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.  

భారీ వర్షాలతో నగరమంతా చెరువులను తలపించింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.రానున్న రెండు గంట్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ  చేసింది వాతావరణ శాఖ.