అర్ధరాత్రి హైదరాబాద్ లో కుండపోత వాన

అర్ధరాత్రి హైదరాబాద్ లో కుండపోత వాన

హైదరాబాద్ సిటీలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 9 గంటలకు మొదలైన వాన అర్ధరాత్రి దాకా ఉరుములు మెరుపులతో కుండపోత పోసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పగలంతా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులు వర్షంతో సేద తీరారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.  బల్దియా మాన్​సూన్​ ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగి రోడ్లపై నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకున్నాయి.

అల్వాల్‌‌‌‌, బోయిన్‌‌‌‌పల్లి, కుత్బుల్లాపూర్‌‌‌‌, మల్కాజిగిరి, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, నాచారం, మల్కాజిగిరి, నేరెడ్‌‌‌‌మెట్‌‌‌‌, జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, దమ్మాయిగూడ, ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌, మాదాపూర్‌‌‌‌, గచ్చిబౌలి, సికింద్రాబాద్‌‌‌‌, పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. విషయం తెలుసుకున్న మేయర్‌‌‌‌ రామ్మోహన్‌‌‌‌.. వర్షం వల్ల ఎక్కడైనా సహాయక చర్యలు అవసరమైన పక్షంలో సేవలందించేందుకు రెడీగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ముషీరాబాద్ పరిధిలోని అడిక్‌‌‌‌మెట్‌‌‌‌ పద్మా కాలనీ, పెద్దమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మాన్​సూన్​ బృందాలు చర్యలు చేపట్టాయి.

వర్షం కురిసిన ప్రాంతాలు       వర్షపాతం(మి.మీ)

బేగంపేట్‌‌‌‌          15.5

శ్రీనగర్‌‌‌‌కాలనీ          7.25

డబీర్‌‌‌‌పురా             7.25

సుమిత్రానగర్‌‌‌‌ కాలనీ            7

యూసుఫ్‌‌‌‌గూడ    6.25

పాటిగడ్డ  6

వెంగళరావునగర్‌‌‌‌   5.75

మైత్రివనం              5.5

ఘాన్సీబజార్‌‌‌‌         5.25

జూబ్లీహిల్స్‌‌‌‌             5.25

బాలాజీనగర్‌‌‌‌          4.5

వేంకటేశ్వర కాలనీ (బంజారాహిల్స్‌‌‌‌)   4.5

గణాంక భవన్‌‌‌‌ (ఖైరతాబాద్‌‌‌‌) 4.5

కవాడిగూడ డంపింగ్‌‌‌‌ యార్డ్‌‌‌‌ 4.25