హైదరాబాద్ లో గురువారం ( 11న ) కుమ్మేసిన వాన.. ఏ ఏరియాలో ఎంతంటే.. ?

హైదరాబాద్ లో గురువారం ( 11న ) కుమ్మేసిన వాన.. ఏ ఏరియాలో ఎంతంటే.. ?

గ్రేటర్​ పరిధిలో గురువారం వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ఎల్బీనగర్‌‌‌‌, వనస్థలిపురం, హయత్​నగర్‌‌‌‌, అబ్దుల్లాపుర్‌‌‌‌ మెట్‌‌‌‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కుమ్మేసింది. హయత్​నగర్​లో అత్యధికంగా 11.40 సెంటీమీటర్ల వర్షం పడింది. 

రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజయవాడ - హైదరాబాద్‌‌‌‌ హైవేపై కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌‌‌‌ నిలిచిపోయింది. రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహించింది.  – వెలుగు, ఎల్బీనగర్

వర్షపాతం వివరాలు

  • హయత్ నగర్    11.4 సెం.మీ
  • ఉప్పల్        4.58 సెం.మీ
  • సరూర్ నగర్    4.15 సెం.మీ
  • నాగోల్        3.10 సెం.మీ
  • కేపీహెచ్​బీ    2.60 సెం.మీ
  • మాదాపూర్    2.53 సెం.మీ