హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట,అమీర్ పేట్, కూకట్ పల్లి, లింగంపల్లి, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీగా వానలు కురుస్తున్నాయి.
గచ్చిబౌలి, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్ పూర్, హైదర్ షా కోట్లా, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, కోకాపేట, గండిపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల వర్షానికి రోడ్లపై నీళ్లు నిలవడంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.