వరంగల్ లో దంచికొట్టిన వాన.. చెరువులను తలపించిన రోడ్లు..

వరంగల్ లో దంచికొట్టిన వాన.. చెరువులను తలపించిన రోడ్లు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. గురువారం ( సెప్టెంబర్ 11 ) మధ్యాహ్నం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. ఉమ్మడి వరంగల్ లోని హనుమకొండ, కాజీపేట, ట్రైసిటీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

జనగామ జిల్లాలోని రఘునాథపల్లి,లింగాలఘనపూర్, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ లో రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం నుంచి హయత్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు  తీవ్ర ఇబ్బంది పడ్డారు.