హైదరాబాద్లో దంచికొట్టిన వాన

హైదరాబాద్లో దంచికొట్టిన వాన

హైదరాబాద్లోవాన దంచికొట్టింది.మంగళవారం (మే27) సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయంత్రంలో ఉద్యోగస్తుల ఇళ్లకు చేరే టైం కావడంతో పలు చోట్ల వానతో ట్రాఫిక్ జాం అయింది.  

గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్,  బిహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.  ఇక సిటీ శివారు ప్రాంతాల్లోనూ వానలు పడ్డాయి. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయియిగూడ మున్సిపాలిటీలో వర్షం పడింది. అల్వాల్ శామీర్ పేట, జవహర్ నగర్ లలో కూడా వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఇక సిటీ శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్,జీడిమెట్ల,సుచిత్ర,కోంపల్లి,దుండిగల్,గండిమైసమ్మ,మల్లంపేట్,బహుదూర్ పల్లి,దూలపల్లి,సూరారం,షాపూర్ నగర్,చింతల్,గాజులరామారంలో భారీ వర్షం కురిసింది. 

మరోవైపు సిటీ మొత్తం మరో మూడు గంటల్లో పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటలకు 40నుంచి 60 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 

మంగళవారం హైదరాబాద్  సిటీలో వర్షాలున్నాయి..అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. నగరవ్యాప్తంగా GHMC DRF, మాన్సూన్ బృందాలు అలెర్ట్ గా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండరాదని హెచ్చరించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు.