ఇండియా, కెనడా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన గండం!

ఇండియా, కెనడా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన గండం!

ఫ్లోరిడా: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ వేదికైన ఫ్లోరిడాను వర్షాలు వీడటం లేదు. ఈ నెల 11న శ్రీలంక, నేపాల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ వాన వల్ల రద్దు కాగా, ఇప్పుడు మరో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు కూడా వాన దేవుడి ఖాతాలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. రాబోయే మూడు రోజులు కూడా వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అమెరికా–ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ (14న), ఇండియా–కెనడా (15న), పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌–ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ (16న) మధ్య జరగాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లపై సందిగ్ధత నెలకొంది. 

ఒకవేళ ఈ మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు వాన వల్ల రద్దయితే పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–8కు వెళ్లే అవకాశాన్ని కోల్పోతుంది. ఇండియా, అమెరికా క్వాలిఫై అవుతాయి. ఒకవేళ ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ చేతిలో అమెరికా ఓడినా, ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌పై పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ నెగ్గినా ఇరుజట్లు చెరో నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ కలిగిన జట్టు ముందుకెళ్తుంది.