హైదరాబాద్‎లో మళ్లీ భారీ వర్షం

హైదరాబాద్‎లో మళ్లీ భారీ వర్షం

హైదరాబాద్‎లో రెండో రోజు భారీ వర్షం మళ్లీ మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపుల్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్య పురి, దిల్‎సుఖ్‎నగర్, మలక్ పేట, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయింది. మాన్ సూన్ సిబ్బందిని సిద్దంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే నిన్న కురిసిన భారీ వర్షాలకు సిటీ మొత్తం అల్లకల్లోలం అయింది. సిటీలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఈ లోగానే మరోసారి వర్షం స్టార్ట్ కావడంతో సిటీ ప్రజలు ఆందోళనపడుతున్నారు. అధికారులు, సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. సిటీ మేయర్, కమిషనర్ ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

For More News..

రన్నింగ్ ట్రైన్‎లో ప్యాసెంజర్ మీద దొంగల గ్యాంగ్‎రేప్

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

పెట్రోల్‎తో పాటు డీజిల్ ధరలు పైపైకి.. వరుసగా ఐదో రోజు పెంపు

పిల్లి పోయిందని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు