
యాదగిరిగుట్ట, వెలుగు : పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని ఓ వ్యక్తి శుక్రవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాదగిరిగుట్ట టౌన్ సీఐ జానకీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డికి చెందిన పిల్లి గత నెల 29 నుంచి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి దాని జాడ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
పిల్లి పోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పెట్ లవర్.. pic.twitter.com/kOV9RW0h0O
— Sravan Reddy (@patelsravan5656) October 9, 2021