ఆసిఫాబాద్, వెలుగు: గ్రామీణ క్రీడాకారుల్లో దాగిఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల స్పోర్ట్స్ స్కూల్లో జిల్లాస్థాయి పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ, మండల, నియోజకవర్గస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారు లకు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసి ప్రస్తుతం క్రీడలు నిర్వస్తామని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో
నస్పూర్, వెలుగు: మంచిర్యాలలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో డీఈవో యాదయ్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు దుర్గాప్రసాద్, అధికారులతో కలిసి జిల్లా యువజన క్రీడా సేవల అధికారి హనుమంత రెడ్డి సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలకు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు.
క్యారమ్స్, చెస్, పికిల్ బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, యోగా, తైక్వాండో, సెపక్ తక్రా, ఇతర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జైపూర్ ఎంఈవో శ్రీనివాస్, డీసీబీఈ ఇన్చార్జ్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ. యాకూబ్, ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ రాజేశ్, ఆయా స్కూళ్ల హెచ్ఎంలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
