కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో వర్షానికి కూలిన ఇండ్లు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో వర్షానికి కూలిన ఇండ్లు

కరీంనగర్/శంకరపట్నం, వెలుగు: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతినగర్ లోని ఓ పెంకుటిల్లు కూలిపోయింది. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో చాలామంది ఇలాంటి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇలాంటి ఇండ్లను అధికారులు సకాలంలో గుర్తించి బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. 

అలాగే శంకరపట్నం మండలం మొలంగూరులో భారీ వర్షాలకు ఇల్లు కూలింది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు శనివారం రాత్రి జంపాల పోచయ్య పెంకుటిల్లు పై కప్పు, గోడ కూలినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.