తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, శుక్రవారం అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. 

ఈ నెల 26న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌‌‌‌ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తామని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌ను జారీ చేసింది.