హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఫుల్ రెయిన్

హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఫుల్ రెయిన్

కాస్త గ్యాప్ ఇచ్చిన రెయిన్ మళ్లీ దంచికోడుతోంది.  హైదరాబాద్ లో జోరుగా వర్షం కురుస్తో్ంది.  పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో  భారీగా వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  

రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతవారణశాఖ హెచ్చరించింది.   11.56 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.