మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం 

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం 
  • భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

మహబూబాబాద్ లో రెండు రోజులుగా కురుస్తన్న వర్షాలకు వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కుండపోత వర్షాలు.. రోడ్లన్నీ జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ శివారులో కత్తెర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్కూల్ కు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి వాగు దాటడం కష్టంగా ఉందంటున్నారు. అత్యవసర పనులకు వెళ్లే వారిని ట్రాక్టర్ సహాయంతో వాగు దాటిస్తున్నారు.