నిర్మల్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 34వ బ్రాంచి ప్రారంభం..సినీ నటి భాగ్యశ్రీ రాకతో సందడి

నిర్మల్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 34వ బ్రాంచి ప్రారంభం..సినీ నటి భాగ్యశ్రీ రాకతో సందడి

నిర్మల్‌‌‌‌, వెలుగు: మాంగళ్య షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌ 34వ బ్రాంచిని నిర్మల్‌‌‌‌లో ఏర్పాటు చేశారు. గురువారం ప్రముఖ సినీ నటి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన చేసి మాల్‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌‌‌‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నిర్మల్‌‌‌‌ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ నిర్మల్‌‌‌‌లో మాంగళ్య షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

మాల్​లో రూ.99 నుంచి రూ.లక్ష వరకు వివిధ ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహేశ్వర్‌‌‌‌రెడ్డి, పద్మావతిరెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కుసుమ వెంకటరత్నం బాబు, మాల్‌‌‌‌ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్‌‌‌‌, కాసం శివప్రసాద్‌‌‌‌, పుల్లూరు అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌ పాల్గొన్నారు.