నవంబర్ 8న తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

నవంబర్ 8న తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి, నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్​, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్​లలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. మరోవైపు మంగళవారం పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యా పేట, నల్గొండ, వరంగల్​, ములుగు, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్​లలో భారీ వర్షం పడింది.