- కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్‌లో మళ్లీ కుండపోత
- రానున్న ఐదు రోజులు మోస్తరు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ
- రాష్ట్రంలో సాధారణం కంటే 28 శాతం అధిక వర్షపాతం
హైదరాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాలను వర్షాలు వదలడం లేదు. వరుసగా మూడోరోజు గురువారం కూడా భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు పడ్డాయి. కరీంనగర్, మెద క్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, నిజామాబాద్జిల్లాల్లో మరోసారి 20 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది.
కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ 10 సెం.మీ. పైగానే వర్షపాతం రికార్డయింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 23.7, నిజామాబాద్ జిల్లా ముగ్పా ల్‌లో 21.1, నిర్మల్ జిల్లా ముథోల్‌లో 18.8, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 18.3, నిజామాబా ద్ జిల్లా సిరికొండలో 17.9, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో 16.2, లింగంపేటలో 16.1, కరీంనగర్ జిల్లా రామడుగులో 12.6, సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 11.8, జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 10.5, మెదక్ జిల్లా హవేలీఘనపూర్‌లో 10 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
అధిక వర్షపాతం నమోదు..
గత మూడ్రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో వర్షపాతం లెక్కలన్నీ మారిపోయా యి. అంతకుముందు వరకు రాష్ట్రంలో నమో దైన సగటు వర్షపాతం సాధారణమే కాగా.. ఇప్పుడు అధిక వర్షపాతానికి చేరింది. వర్షాకా లం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సగ టు వర్షపాతం 55.85 సెం.మీ. కురవాల్సి ఉండగా.. ఏకంగా 71.43 సెం.మీ. కురిసింది. అంటే సాధారణం కంటే 28 శాతం ఎక్కువ వర్షపాతం రికార్డయింది.
మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, కామారెడ్డి, నారాయణపేట, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం రికార్డు కాగా.. రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధిక వర్షపాతం రికార్డ్ అయింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 103.81 సెం.మీ.వర్షపాతం రికార్డయింది. కాగా, వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
