
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చని గురువారం ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండ దంచికొట్టగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది.