తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్  జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్ర, శనివారాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది. 
శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. హైదరాబాద్​లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే చాన్స్ ఉందని చెప్పింది. కాగా, ప్రస్తుతం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఉందని, దాని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.